‘సలార్‌’ కోసం ఐదు భాషల్లో శ్రుతి హాసన్ డబ్బింగ్‌ !

-

ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది శ్రుతిహాసన్‌. ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’తో నటిస్తోంది. ‘కేజీఎఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ తన పాత్ర కోసం డబ్బింగ్‌ చెప్పడం షురూ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ‘సలార్‌’ కోసం మొత్తం ఐదు భాషల్లోనూ తన సొంత గొంతునే వినిపించనుందట. ఇప్పటికే మూడు భాషలకు సంబంధించిన డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయని.. మరో రెండు భాషల్లో డబ్బింగ్‌ చెప్పాల్సి ఉందని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఈ చిత్రంలో ఆమె ఆద్య అనే పాత్రలో కనిపించనుంది.  ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబరు 28న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version