‘సలార్‌’ షూట్​ను కంప్లీట్​ చేసిన శ్రుతి హాసన్

-

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్​ సినిమా ‘సలార్’​. పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తోన్న ఈ మూవీలో రెబల్ స్టార్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో ఆద్యగా నటిస్తున్న హీరోయిన్​ శ్రుతి హాసన్​​ షూటింగ్​లో భాగంగా తన షూట్​ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్​కు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఈ ‘సలార్​’ తార.. సెట్​లో తీసుకున్న ఓ ఫొటోను షేర్​ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అందులో శ్రుతితో పాటు సలార్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​, సినిమాటోగ్రాఫర్​ భువన గౌడలు ఉన్నారు.

“నన్ను మీ ఆద్యగా మార్చుకున్నందుకు ప్రశాంత్‌ నీల్‌కు థ్యాంక్స్​.అలాగే డార్లింగ్‌ ప్రభాస్‌కు ధన్యవాదాలు. మీ అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన చిత్రంలో పని చేయడం చాలా బాగుంది. చివరికి నిజంగా ఓ కుటుంబంలా అనిపించింది” అంటూ ఇన్​స్టాలో పోస్ట్​ కింద రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్​గా అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news