రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సోనాలి బింద్రే.. సక్సెస్ అవుతుందా..?

-

సోనాలి బింద్రే.. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మురారి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పరికిణి లో కనిపించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . అందం, అభినయంతో పాటు మహేష్ బాబు కి తగ్గ జోడీ అంటూ అప్పట్లో ఎన్నో ప్రశంసలు కూడా పొందింది. మొదటి సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సోనాలి బింద్రే .. ఆ తర్వాత ఖడ్గం , ఇంద్ర, మన్మధుడు వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్న సోనాలి బింద్రే ఆ తర్వాత బాలీవుడ్లో కూడా తన హవా కొనసాగించింది.

ఇకపోతే సినిమాలకు కొంత కాలం దూరంగా ఉన్న ఈమె ఉన్నట్టుండి క్యాన్సర్ బారిన పడడంతో అభిమానులు మొత్తం ఆందోళనలు వ్యక్తం చేశారు. అంతేకాదు తోటి నటీనటులు కూడా సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేశారు. అదృష్టవశాత్తు ప్రాణాంతక వ్యాధి నుంచి సోనాలి బింద్రే బయటపడింది. దీంతో అటు సినీ ఇండస్ట్రీ, ఇటు సినీ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక పూర్తిగా కోలుకున్న సోనాలి బింద్రే ఇప్పుడిప్పుడే సినిమాలలోకి మళ్లీ రావాలని ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయింది ఈ ముద్దుగుమ్మ. సోనాలి బింద్రే సినిమాలో నటించబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో బాగా మొదలైంది.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న #NT30 అనే సినిమాలో సోనాలి బింద్రే కు అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి డైరెక్టర్ త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో సీనియర్ హీరోయిన్ ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే బాటలోనే కొరటాల శివ కూడా సీనియర్ హీరోయిన్లను తన సినిమాల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోనాలి బింద్రే ను సంప్రదించినట్టు గా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడక తప్పదు. ఇదే నిజమైతే సినీ ప్రేక్షకులకు ఇదొక పెద్ద పండగ అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news