అలాంటి పాత్రలు ఎందుకు చేశానా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోనాలి బింద్రే..!!

-

మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనాలి బింద్రే ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఆమెకు ఉన్నట్టుండి క్యాన్సర్ రావడంతో సినిమాలకు దూరం అయ్యి విదేశాలకు వెళ్లి ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడి.. చివరికి సినీ అభిమానులు , ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీల ప్రార్థనలతో ఆమె బ్రతికి బయట పడింది. కాకపోతే సినిమాలకు దూరం అయిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు .త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం.sonali bendre: డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా: సోనాలి బింద్రే - actor sonali bendre reacts on doing cringe films in past for paying rent and bills | Samayam Teluguఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్లో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది. ఏ హీరోయిన్ అయినా సరే అవకాశాలు లేకపోతే వచ్చిన పాత్రను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు తమకు నచ్చని పాత్రలు కూడా చేయాల్సి వస్తాయి. అందులో ఒకటి డబ్బు.. రెండవది పేరు. ఇక సినీ ఇండస్ట్రీలో చాలామంది డబ్బు కోసం మాత్రమే ఇష్టం లేని పాత్రలు కూడా చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు.. ఇక అందులో నేను కూడా అతీతం కాదని ఆమె స్పష్టం చేసింది .ఇకపోతే ఒకానొక సమయంలో నా చేతిలో సినిమా అవకాశాలు లేవు.. డబ్బు అవసరం కాబట్టి అలాంటి పాత్రలో నేను చేయడం ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.. కాని తప్పని పరిస్థితుల్లో ఏ పాత్ర అయినా సరే చేస్తాను అని చెప్పి చేశాను. కానీ చాలా బాధపడ్డాను. ఇక ఎందుకు ఒప్పుకున్నాను అని బాధపడి కానీ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత నెరవేర్చక తప్పదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో చేశాను.. ఆ సమయంలో క్యాన్సర్ తో పోరాడాను. ఇలాంటి క్షణాలు నా జీవితంలో వద్దు అంటూ ఆమె తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news