బాలయ్య ఫ్యాన్స్‌కు ట్రీట్..NBK 107 మాస్ పోస్టర్ రిలీజ్

-

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘అఖండ’ విజయం తర్వాత ఆయన ప్రస్తుతం ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 ఫిల్మ్ చేస్తున్నారు. కాగా, మేకర్స్ శనివారం సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

శకపురుషుడు ఎన్టీఆర్ ను తలుచుకుంటూ NBK 107 పోస్టర్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సదరు పోస్టర్ లో బాలయ్య చాలా వయ్ లెంట్ గా కనిపిస్తున్నాడు.

వైట్ షర్ట్ , ప్యాంట్ ధరించి పొడవాటి కత్తిని చేతి పట్టుకుని మాస్ లుక్ లో బాలయ్య అదరగొడుతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే గోపీచంద్ మలినేని చిత్రంలో మాస్ సీన్స్ పైన బాగా ఫోకస్ చేసినట్లు స్పష్టమవుతోంది. యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెప్తున్నారు.

మైత్రిమూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుండగా, విలన్ రోల్ ను కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ప్లే చేస్తున్నారు. కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version