అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన థమన్..!

-

బోయపాటి శ్రీను డైరెక్షన్లో.. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2021లో వచ్చిన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే మొదటి రూ.100 కోట్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉందని అయితే దానిని వీలు చూసుకుని బోయపాటి శ్రీను కూడా గతంలో స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్. థమన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అందించడం గమనార్హం.

మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన పోస్టులో అఖండ సినిమా క్లిప్పును షేర్ చేశారు. దీని క్యాప్షన్ లో.. “Let’s meet soon in #Akhanda 2” అని రాశారు. దీనిని బట్టి చూస్తే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని చెప్పవచ్చు. అఖండ సినిమా గత ఏడాది జనవరి 21వ తేదీన ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయింది . ఓటీటీ లోకి వచ్చిన 24 గంటలు గడవక ముందే మిలియన్ స్ట్రీమింగ్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అఘోరా గెటప్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కూడా లభించింది.

అఘోర గెట్ అప్ లో బాలయ్య కనిపించిన ప్రతిసారి థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. జగపతిబాబు, పూర్ణా, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. మొత్తానికి అయితే ఈ సినిమాకి సీక్వెల్ వుందని తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version