22 ఏళ్ల క్రితం వచ్చి పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇచ్చిన ఆ సినిమా రీ రిలీజ్ కు సిద్ధం..

-

కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్‌కి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు… ఈ క్రమంలోనే ఇప్పటివరకు అల్లు అర్జున్ పుష్ప, రజనీకాంత్ బాబా, అబ్బాస్, టాబు, వినీత్ నటించిన ప్రేమదేశం చిత్రాలు రీ రిలీజ్ చేయటానికి సిద్ధమయ్యారు.. అలాగే 12 ఏళ్ల క్రితం విడుదలై మెగా బ్రదర్ నాగబాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చిన ఆరంజ్ సినిమాను కూడా రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.. అయితే ఇదే క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బ్రేక్ ఇచ్చిన ఓ చిత్రం రీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది..

కొన్నాళ్ల క్రితం విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకున్న చిత్రాలను అలాగే విడుదలై బెంజ్ మార్క్స్ సి ఎస్ కి కొన్ని సినిమాలను మళ్లీ రిలీజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు సినీ వర్గాలు.. ఈ విషయం అభిమానులకు సైతం ఎన్నో ఆనందాన్ని కలిగిస్తుంది తన అభిమాన హీరో చిత్రాన్ని మళ్లీ థియేటర్లో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ అంటే వచ్చే ఆనందమే వేరు ఇదే క్రమంలో ఆయన నటించిన బద్రి చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది చిత్ర బృందం..

పవర్ స్టార్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ బద్రి.. థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. 22 సంవత్సరాల తరువాత పవర్ స్టార్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా బద్రి సినిమాను సిల్వర్ స్క్రీన్ మీద చూసే అవకాశం కల్పించబోతున్నారు. 2000 సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా ఆన్ స్క్రీన్ పైన మంచి విజయాన్ని సాధించింది ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఇందులో రేణు దేశాయ్ అమీషా పటేల్ హీరోయిన్ గా నటించారు.. అప్పట్లో ఈ చిత్రం ఓ సెన్సేషన్ను క్రియేట్ చేసింది.. మన అభిమానుల్లో ఎంతగానో అలరించిన ఈ చిత్రం ఆయనకు బ్రేక్ తీసుకొచ్చిందని చెప్పాలి ఈ సినిమాతో పవన్ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు పవర్ స్టార్ గా అభిమానులు గుండెల్లో నిలిచిపోయారు అయితే ప్రస్తుతం ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపించడంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version