ఓటిటి లో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలివే …!

కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3.0 లాక్‌డౌన్‌లు ముగిసింది. అయితే కొన్ని సడలింపులతో మే-18 నుంచి 31 వరకు 4.0 కొనసాగనుంది. అయితే ఈ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు..ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్సే లో బొమ్మ పడే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు.

 

ఈ కారణంగా ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దంగా ఉన్న సినిమాల నిర్మాతలకు ఆర్ధికంగా భారీ నష్టమే జరిగింది. ముఖ్యంగా.. సమ్మర్ స్పెషల్ గా చాలా సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కాని కరోనా ఏసిన దెబ్బతో ఒక్క సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయలేని పరిస్థితి. ప్రతి సమ్మర్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కళ కళ లాడే మల్టీఫ్లెక్స్, థియేటర్స్ ఇప్పుడు ఆ కళ తప్పాయి. దీంతో చిత్ర పరిశ్రమలు ఇప్పట్లో కోలుకునే లా కనిపించడం లేదు.

అందుకే భారీ బడ్జెట్ సినిమాల దగ్గర్నుంచి చిన్న సినిమాల వరకూ ఓటీటీ లో రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో కొందరు మేకర్స్ విడుదల చేయడానికి సిద్ధమైపోతున్నారు. అయితే కొన్ని సినిమాలను మాత్రం ఎంత ఆలస్యమైనా సరే థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కాని కొంతమంది ఒక మోస్తారు లాభాలు వచ్చినా ఫర్లేదు అని ఓటీటీలో రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు. ఇలా ప్రస్తుతం ఏడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇందులో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాలు రెడీగా ఉన్నాయి.

వాటిలో కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్‌’ (తెలుగు, హిందీ), అమితాబ్ బచన్ ‘గులాబో సితార’ (హిందీ), ‘శకుంతల దేవి’ (హిందీ), ‘లా’ (కన్నడ), ‘ఫ్రెంచ్‌ బిర్యానీ’ (కన్నడ), ‘పొన్‌మగళ్‌ వందన్‌’ (తమిళ్‌), ‘సుఫియం సుజాతాయాం’ (మలయాళం) సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇక కోన వెంకట్ లాంటి నిర్మాతలు తమ సినిమాలని ఎంత ఆలస్యం అయినా థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని తేల్చి చెప్పారు.