Unstoppable: అధికారం కోసం షోకి రాలేదు.. పవన్ కళ్యాణ్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు నాటలో ఒక వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు యువత ఆ పేరు వింటే చాలు పిచ్చెక్కిపోతారు. అదేవిధంగా నందమూరి బాలయ్య గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నందమూరి బాలకృష్ణ అంటే ఆయన అభిమానుల ఇంట్లో ఒక మనిషి లాగే.. ఇకపోతే బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షో హై రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ షోలో పలువురు సూపర్ స్టార్స్, రాజకీయ నాయకులు పాల్గొనగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుండగా.. రెండో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోన్ రిలీజ్ చేసింది ఆహా..

అంతేకాదు ఫిబ్రవరి 10వ తేదీన రెండవ ఎపిసోడ్ ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి అభిమానుల కోసం ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్లో రాజకీయ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పలు ఆసక్తికర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. మరి ముఖ్యంగా రాజకీయాల విషయమై జనసేన ని పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.. బాలయ్య పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ..” నీపై అభిమానుల అభిమానాన్ని ఓటు రూపంలో ఎందుకు మార్చుకోలేకపోయారని? ప్రశ్నించారు..

ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. సినిమా జీవితం వేరు.. రాజకీయ జీవితం వేరు.. సినిమాలలో పేరు రావడం వెనుక నా కష్టం ఉంది..అదేవిధంగా రాజకీయాల్లో అదే స్థాయిలో పేరు రావాలంటే అంతే కష్టపడాలి. రాత్రికి రాత్రే అద్భుతాలు అయితే జరగవని అయితే అధికారంలోకి వస్తానని నేను ఇక్కడికి రాలేదు.. నేను ఇంకా ప్రజల నమ్మకం సంపాదించుకునే స్టేజ్ లోనే ఉన్నాను అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news