అదిరిపోయే లుక్ తో సైకిల్‌పై నారప్ప పెద్దకొడుకు …!

-

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నారప్ప”. ఈ సినిమా లో హీరో వెంకటేష్ మధ్య వయసుడిగా నటిస్తుంటే… ఆయన సరసన ప్రియమణి నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెట్రిమారన్ దర్శకత్వం వహించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. తమిళంలో మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో నిండిన ఈ కథతో ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు చేసింది.

Venkatesh narappa movie poster
Venkatesh narappa movie poster

ఇక ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాను రూపొందించాలని ఉద్దేశంతో దర్శకనిర్మాతలు, ఈ చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే పాత్రకు తగ్గట్టు సహజంగా ఉండేలా ఈ సినిమా షూటింగ్ సంబంధించి చాలా వరకు అనంతపురం జిల్లాలో షూటింగ్ నిర్వహించారు. రీవెంజ్ కథతో వస్తున్న నారప్ప సినిమా లో ఇప్పటికే విక్టరీ వెంకటేష్, ప్రియమణి ల లుక్ విడుదల చేయగా తాజాగా సినిమాలో వెంకటేష్ పెద్ద కొడుకుగా నటిస్తున్న మునికన్నా పోస్టర్ ను విడుదల చేసింది. మునికన్నా పాత్రలో నటిస్తున్న కార్తీక్ రత్నం తన పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కార్తీక్ హీరో సైకిల్ పై వెళ్తున్నట్టుగా పోస్టర్ రూపు దిద్దుకొంది. నారప్ప సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్., వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news