రష్మిక బిగి కౌగిలిలో విజయ్ దేవరకొండ.. గీతాగోవిందం మళ్లీ ఏదో చేసేలా ఉన్నారు..!

-

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాకినాడ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో యూత్ లీడర్ గా విజయ్ కనిపిస్తాడట. సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ మూవీ టీజర్ మార్చి 17న రిలీజ్ చేస్తున్నారట.

టీజర్ డేట్ చెప్పడంతో పాటుగా సినిమా నుండి విజయ్, రష్మికల మరో పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. విజయ్ ను తగ బిగి కౌగిలిలో బధించేసింది రష్మిక. గీతా గోవిందం సినిమాలో ఈ ఇద్దరు పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి. మళ్లీ ఈ సూపర్ హిట్ జంట నటిస్తున్న డియర్ కామ్రేడ్ కు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పోస్టర్ ను తన ట్విట్టర్ లో పెట్టడమే కాకుండా సినిమా సౌత్ అన్ని భాషల్లో అంటే తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుందని హింట్ ఇచ్చాడు. మరి టీజర్ తోనే సినిమాలో విషయం ఎంత ఉన్నదో అర్ధమవుతుంది. అది తెలియాలంటే మరో 10 రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version