బాలీవుడ్ భామ మలైకా అరోరా ఈ వయసులో కూడా తన అందంతో కుర్రకాలను పిచ్చెక్కిస్తుంది. ఈమె హాట్ నెస్ చూస్తేనే హీరోయిన్లకు సైతం అసూయ పుడుతుంది. ఐటెం సాంగ్స్ తో అలరిస్తూ.. 50 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో అలరిస్తుంది. తాజాగా నటి మలైకా అరోరా బిగ్ షాక్ తగిలింది. బాలీవుడ్ నటి మలైకా అరోరాపై వారెంట్ జారీ అయింది.

2012లో జరిగిన హోట్ దాడి కేసులో ఆమెకు ముంబైలోని మెజిస్ట్రేట్ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నటుడు సైఫ్ అలీ ఖాన్, మలైకా, కరీనా కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లగా, అక్కడ మరో కస్టమర్‌తో గొడవ కాగా అతడిపై సైఫ్ దాడి చేశారు. కాగా, ఈ కేసు విచారణలో సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు హాజరుకాకపోవడంతో రెండోసారి బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.