జబర్దస్త్ నరేష్ కి వున్న లోపంపై వైద్యులు ఏమన్నారంటే.. వీడియో వైరల్..!

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న అనేక కామెడీ షోలలో జబర్దస్త్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎంతో మంది ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని అందివ్వడమే కాకుండా ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్లకు గుర్తింపు ఇచ్చింది. అంతేకాదు ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి ఆసరాగా నిలబడిన జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ క్రమంలోనే కొంతమంది జబర్దస్త్ ను ఇప్పటికీ కూడా వీడి వెళ్ళిపోకుండా తమ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి జబర్దస్త్ చేసిన మేలును మరిచిపోయి .. రకరకాల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కానీ మరి కొంతమంది ఏం జరిగినా సరే ఇక్కడే ఉండాలన్న ఆలోచనతో ఇప్పటికే కొనసాగుతున్నారు.


అలాంటి వారిలో జబర్దస్త్ నరేష్ కూడా ఒకరు. పొట్టి నరేష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన కామెడీతో.. పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. అంతేకాదు తన యాక్టింగ్ తో అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్న నరేష్ కు లోపం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన వయసు ఇప్పుడు 20 సంవత్సరాలు దాటిన ఇంకా చిన్నపిల్లాడిలాగే కనిపిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ నరేష్ పై రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు . అయితే ఇప్పటివరకు ఆయన తన లోపం గురించి ఏ రోజు కూడా బాధపడలేదు. కానీ మొదటిసారి తన లోపంపై వైద్యులు ఏమన్నారు అనే విషయాన్ని తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.

తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బావగారు బాగున్నారా అనే ఎపిసోడ్ రన్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా.. అందులో చాలామంది జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్లతో పాటు పలువురు సెలబ్రిటీలు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. చివరలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలను స్క్రీన్ పై చూపిస్తూ వాటికి సమాధానాలు కూడా తెలిపారు సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే నరేష్ కి ఉన్న ఆరోగ్య విషయంపై వైద్యులు ఏమన్నారు అనే ప్రశ్న ఎదురవగా.. నరేష్ ఆ విషయాన్ని చెబుతున్నప్పుడు ప్రోమో మ్యూట్ చేశారు . అంతే కాదు అక్కడున్న వారు ఒక్కోసారిగా ఎమోషనల్ అవడం జరిగింది. దీంతో అసలు ఏం జరిగింది అనేది తెలియాలి అంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version