పవన్ కి హీరోయిన్ ఎందుకు దొరకడం లేదు…?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… హీరోగా చేసే సినిమా అంటే హీరోయిన్స్ ఎక్కువగా ఆయన సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాని ఇప్పుడు ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో మాత్రం హీరోయిన్ దొరకడం లేదు. ఆరుగురు హీరోయిన్స్ పేర్లను ఇప్పటి వరకు పరిశీలించారు. శృతి హాసన్, కీర్తి సురేష్, సమంతా, త్రిష, కాజల్ ఇలా చాలా మంది పేర్లను చిత్ర యూనిట్ పరిశీలించింది.

అయినా సరే ఏ హీరోయిన్ కూడా ఇప్పటి వరకు ముందుకి రావడం లేదు. దీనిపై ఇప్పుడు పవన్ కూడా అసహనంగానే ఉన్నారు. సినిమా ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైతే హీరోయిన్ అవసరం ఉంటుంది. కాబట్టి హీరోయిన్ ని ఎంపిక చేయడం అనేది అత్యవసరంగా మారింది. హీరోయిన్ కి ఎవరూ రాకపోవడానికి ప్రధాన కారణం…

ఈ సినిమాలో హీరోయిన్ అవసరం చాలా తక్కువ. ఒకటి రెండు పాటలు లేదా రెండు మూడు సన్నివేశాలు కేవలం ఒక 20 నిమిషాలకు మించి హీరోయిన్ ఎక్కడా కనపడే అవకాశం ఉండదు. పాటలు, సీన్స్ అన్ని కలిపి 20 నిమషాలు మాత్రమే హీరోయిన్ ఉంటుంది. అందుకే ఎవరూ కూడా ముందుకి వచ్చి సినిమా చేయడం లేదని అంటున్నారు. మరి ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news