రష్మీ గౌతమ్ లవ్ సక్సెస్ అవుతుందా..?

-

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా ఒకవైపు ప్రేక్షకులను అలరిస్తూనే మరొకవైపు సమాజంలో అక్కడక్కడ జరిగే అన్యాయాలపై స్పందిస్తూ ఉంటుంది. అదేవిధంగా తనకు తెలియకుండానే ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సుధీర్ తో ఆమె ప్రేమలో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇది సస్పెన్స్ గానే మిగిలిపోయింది . మరొకవైపు ఆమెకు సీక్రెట్ లవ్ స్టోరీ ఉందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఏది నిజమవుతుందనేది కూడా మరొక సస్పెన్షన్ అని చెప్పాలి. ఇకపోతే తాజాగా తన ప్రేమను తేల్చుకునే సమయం వచ్చిందని చెప్పవచ్చు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన ప్రేమకి పరీక్ష పెట్టుకుంది రష్మీ. ఒక బాక్స్ లో రాయి వేస్తే అందులో పడాలి.. పడితే అనుకున్నది జరుగుతుందని.. పడకపోతే లేదనే..ఒక గేమ్ పెట్టారు.. ఇందులో ప్రముఖ కమెడియన్ బ్రహ్మాజీ, బుల్లెట్ భాస్కర్ అలాగే రష్మీ కూడా పాల్గొన్నారు. ఇకపోతే బ్రహ్మాజీ తనదైన కామెడీ పంచితే, బుల్లెట్ భాస్కర్ చేసిన అతికి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో బట్టలూడదీసి మరి రచ్చ చేశారు మిగతా కంటెస్టెంట్స్.

ఇక తర్వాత రష్మీ వంతు వచ్చింది. ఆమె కూడా కోరుకునే సమయం వచ్చింది. యాంకర్ రష్మి తన ప్రేమను కోరుకుంది. నా లైఫ్ లో నా లవ్ సక్సెస్ అవుతుందా? లేదా? రాయి బాక్స్ లో పడితే నా లవ్ సక్సెస్ అవుతుంది.. పడకపోతే కాదు.. అనేలా రష్మి కామెంట్ చేసింది. దీనితో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక రాయి పడుతుందా లేదా అనేది అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు రాయిని వేసింది. అయితే అది అందులో పడిందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా వదిలేసారు. కానీ రష్మీ తన రాయి పడలేదన్నట్టుగా నోరెళ్లబెట్టిన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news