రెబల్ స్టార్ ప్రభాస్ తో “అక్కినేని” బ్యూటీ రొమాన్స్ !

-

కృతి శెట్టికి క్రేజ్‌ మాములుగా లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన కృతి శెట్టి.. మొద‌టి సినిమా తోనే కావాల్సినంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో కృతి శెట్టి అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ గా గ‌డిపేస్తుంది. కృతి శెట్టి న‌టించిన ఉప్పెన సినిమాతో పాటు శ్యామ్ సింగ రాయ్, బంగ‌ర్రాజు వంటి సినిమా బ్లాక్ బాస్ట‌ర్ కావ‌డంతో మ‌రిన్ని సినిమా అవ‌కాశాలు వ‌చ్చి చేరుతున్నాయి.

ప్ర‌స్తుతం హీరో సుధీర్ బాబుతో ఆ ఆమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తుంది. అలాగే రామ్ పోతినేని.. వారియ‌ర్ సినిమాలోనూ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా కృతి శెట్టికి మరో బంపర్‌ ఆఫర్‌ తగిలింది. ప్రభాస్‌ సినిమాలో హీరోయిన్‌ గా ఈ బ్యూటీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది.

మారుతి-ప్రభాస్‌ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు రాజా-డిలాక్స్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులో.. ప్రభాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారు. అందులో కృతి శెట్టి కూడా ఒక హీరోయిన్‌ అని టాక్‌ వినిపిస్తోంది.. అయితే..దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version