శనివారం నాడు శనిదేవుడికి పూజ చేసే విధానం ఇదే…!

-

శని దేవుడినే న్యాయదేవుడు అని అంటారు. శని దేవుని పూజిస్తే చేసే కర్మల ప్రకారం గానే ఈ దేవుడు ఫలితాన్ని ఇస్తాడు అని భక్తుల నమ్మకం. శని దేవుడి ముందు ఆవ నూనె తో దీపం వెలిగించినా, నల్ల నువ్వుల తో దీపం వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది. శని దేవుని అనుగ్రహం పొందడానికి ఎక్కువగా శనివారం ఆధారిస్తారు. శనివారం రోజు శనిని పూజించే సమయం లో శివుడికి కూడా పూజ చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే బాధలు తొలగి పోతాయి. అలానే కుటుంబం అకాల మరణం నుంచి కూడా విముక్తి పొందుతుంది అని అంటారు.

ఇది ఇలా ఉంటె శని దేవుడికి పూజ ఎలా చెయ్యాలి..? ఈ విషయం లోకి వస్తే… ఓం నమః శివాయ అని జపం చేస్తూ శనివారం రోజు నల్ల నువ్వులు మరియు నీళ్ళు శివుడికి సమర్పించాలి. ఇలా శివుడు మరియు శని ఇరువురుని పూజించిన వారి సమస్యలను తొలగింస్తారని ప్రతీతి. నల్లని వస్త్రాలను ధానం చేయడంతో పాటు, నల్ల కుక్కలకు ఆహారాన్ని అందించాలి. ఇలా చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది. బియ్యంపిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి ప్రమిదను తయారు చేయాలి. అందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి.

ప్రతి శనివారం శని శాంతి మంత్ర స్తుతి అయిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే శని బాధ నుంచి విముక్తి కలుగుతుంది. వేకువజామునే లేచి తులసి కోట ముందు ఆవు నేతి తో గానీ, నువ్వుల నూనె తో గానీ దీపం వెలిగించాలి. ఇలా ఆచరిస్తే శుభం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news