అరుణాచల నామం మహిమ గురించి తెలుసా..?

-

సాధారణంగా మనం ఏదో ఒక నామాన్ని జపించడమో లేదంటే ఆ నామము చెబుతూ పూజ చెయ్యడం చేస్తాం. కానీ ఆ నామం వెనుక ఎంత మహిమ ఉందో మనకి తెలియక పోవచ్చు. అయితే అరుణాచల నామం కూడా ఈ నామాల్లో ఒకటి. మరి దాని యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడే చూద్దాం. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాల లో ఒకటి. దక్షిణ భారతం లో వెలసిన పంచలింగ క్షేత్రముల లో అగ్నిభూతమునకిది ప్రతీక. అగ్ని క్షేత్రమని ఎందుకు అంటారు అనే విషయానికి వస్తే.. గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్మ్యం తెలుపుతుంది. ఇది జ్యోతిర్లింగమని.. తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము.

ఈ ఆలయాన్ని దర్శించడానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు వెళ్తుంటారు. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందని అంటారు. అలానే దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. అలానే ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అని అంటారు. అందుకే ఈ ఆలయం చుట్టూ ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు.

ఇక అరుణాచల నామము గురించి చూస్తే… ఈ నామము చాల విశిష్టమైనది. ఎంత విశిష్టమైనది అంటే…? అరుణాచల అనే మంత్రం నమఃశ్శివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువైంది. . 3 కోట్ల సార్లు “నమఃశ్శివాయ” అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి ”అరుణాచల” అని స్మరిస్తే వస్తుంది అని ఒకసారి భగవాన్ అన్నారు. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా..? అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి. నమశ్శివాయ అనేది యోగ పంచాక్షరి ఈ విషయం స్కాంద పురాణంలో కూడా రాయబడి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news