అతిపెద్ద విష్ణు ఆలయం ఎక్కడుందో తెలుసా?

-

శ్రీరంగం ఆలయం, తిరుచిరాపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో కలదు. దేవాలయం కావేరి – కొల్లిదం (కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉన్నది. ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణుభగవానిని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం కూడా. శ్రీరంగం శ్రీమహావిష్ణువు దివ్యక్షేత్రాలలో మొదటిది మరియు ముఖ్యమైనది. విష్ణువు పాలసముద్రం నుండి ఇక్కడే ఉద్భవించినది. ప్రపంచములో అతిపెద్ద విష్ణు దేవాలయం కూడా ఇదే. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువరంగన్‌ అనేవి శ్రీరంగం క్షేత్రానికి గల ఇతర పేర్లు. శ్రీరంగం ఆలయాన్ని ‘ ఇండియన్‌ వాటికన్‌” గా కూడా పిలుస్తారు. రావణుడు తమ్ముడు విభీషణుడు, అన్న చేసే దురాగతాలు చూడలేక హితబోధనలు చేస్తాడు. నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు రావణుడు ఆ మాటలను పెడచెవిన పెడితే, విభీషణుడు రాముడు వద్దకు వెళతాడు.

15 Fascinating Facts about the Sri Ranganathaswamy Temple

రావణుడి వధ అనంతరం, విభీషణుడు భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇచ్చి, దానిని కింద పెట్టకూడదని ఉపదేశిస్తాడు. లంకకు వెళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు. కాసేపయినాక తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తుతాడు … కానీ ఆ విగ్రహం లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు. అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు (లంక దక్షిణ దిక్కున కలదు).

ఆలయం శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్దది. అందరూ కంబోడియాలో అంకోర్‌వాట్‌ దేవాలయాన్నే అతి పెద్దది అనుకుంటారు. కానీ ఈ దేవాలయం శిధిలావస్థలో ఉన్నది. కనుక నిత్యం పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ విష్ణు దేవాలయం ఇదే అని శ్రీరంగం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొనటం జరిగింది.

సుమారు 157 ఎకరాలలో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగ మూర్తి విగ్రహం కలదు. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉన్నది. గుడి ప్రాంగణంలో 50 పైచిలుకు దేవత మూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. బహుశా మరే విషుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవేమో.
శ్రీరంగం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. భక్తులు వీటిగుండా లోనికి నడుచుకుంటూ వెళుతారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది.

మొదటిది, రెండవది మొదటి ప్రాకారం – ఇక్కడ చిలుకల మండపం, యాగశాల, విరాజుబావి మొదలుగునవి చూడవచ్చు. రెండవ ప్రాకారం – పవిత్రోత్సవ మండపం, హయగ్రీవులకు, సరస్వతీ దేవికి ఆలయాలను చూడవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version