భారతీయలకే కాకుండా విశ్వగ్రంథంగా పేరుగాంచిన అతి పవిత్రమైన గ్రంథం భగవద్గీత దీన్ని గురించి అందరికీ ఎంతోకొంత పరిచయం ఉంటుంది. అయితే దీనిలో గురువులు, భాష్యకారులు, పెద్దలు, ప్రవచనకర్తలు ఆయా సందర్భాల్లో చెప్పిన విశేషాల పరంపరను సందర్భాలను బట్టి మీకు అందించే ప్రక్రియలో భాగంగా నేడు భగవద్గీతను ప్రధానంగా ఎన్ని భాగాలుగా చేశారో తెలుసుకుందాం..
మహాభారతం మధ్యలోని భీష్మపర్వంలో భగవద్గీత వస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీత ఇది. భారతంలో హంసగీత వంటివి మరికొన్ని ఉన్నా దీనికి ఉన్న ప్రాధాన్యతవల్ల ఇది ప్రఖ్యాతిగాంచింది. భారతయుద్ధంలో దీన్ని శ్రీకృష్ణుడు బోధించారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలను తత్తవేత్తలు మూడు భాగాలుగా చేశారు. అందరికీ సులువుగా అర్థం కావడానికి ఈ పనిచేశారు. మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగం. ఏడు నుంచి పన్నెండు అధ్యాయాలు భక్తియోగమని. 13-18వరకు ఉన్న అధ్యాయాలను జ్ఞానయోగమని పేర్లు. వీటినే మూడు షట్కాలు అని కూడా అంటారు. అయితే వీటిని మాత్రం విడివిడిగా చూడకూడదు. గీతలో అనేక సూక్ష్మ రహస్యాలు ఉన్నాయి. వాటిని చదివినవారిని బట్టి రకరకాలుగా అర్థమవుతుంది.
– కేశవ