మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందో లేదో ఇలా తెలుసుకోండి..!

నెగెటివ్ ఎనర్జీ పోవడానికి కంటిన్యూగా ఈ ప్రక్రియను చేయండి. వారం, పదిరోజుల్లో మార్పు వస్తుంది. నీరు తెల్లగా ఉండే వరకు ఈ ప్రక్రియను పాటించండి.

చాలామంది వ్యక్తులు రకరకాలైన సమస్యలతో బాధపడుతుంటారు. చాలా కష్టపడుతారు కానీ ఫలితం ఉండదు. ఇంటికి పోతే ప్రశాంతత ఉండదు. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక వివాదం, చికాకులు, ఆందోళనలు అంతేకాదు పిల్లలతోనో లేకుంటే పెద్దలతోనో లేదంటే ఆరోగ్య సమస్య లేదా ఆర్థిక సమస్య.

How to know about negative energy in home

ఇలా నిత్యం ఏదో ఒక సమస్య మీ ఇంట్లో ఉందంటే తప్పక నెగెటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నట్లే. అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి? దీని ఎలా పారద్రోలాలి అనేదే పెద్ద ప్రశ్న. కానీ చాలా సింపుల్ వెరీవెరీ పవర్‌పుల్ తంత్రం పాటించండి.. నెగెటివ్ ఎనర్జీ నుంచి బయటపడండి.

నెగెటివ్ ఎనర్జీని ఎలా తెలుసుకోవాలి?

పొద్దున్నే లేచి స్నానసంధ్యాదులు అంటే అదేనండి స్నానం, దీపారాధన చేసుకుని శుభ్రమైన గాజుగ్లాసులో శుభ్రమైన నీరు తీసుకోండి. దానిలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు (గళ్ల ఉప్పు) వేయండి. అలా రెండు లేదా నాలుగు గ్లాసులను బెడ్‌రూం, హాల్‌లో మూలలలకు పెట్టండి. వాటిమీద ఎటువంటి మూతలు పెట్టకండి. వీటిని 24 గంటల వరకు కదిలించకుండా ఉండండి. తర్వాత పరీక్షించండి. ఆ గ్లాసులో నీరు నల్లగా మారితే తప్పక మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లే.

నెగెటివ్ ఎనర్జీ పోవడానికి కంటిన్యూగా ఈ ప్రక్రియను చేయండి. వారం, పదిరోజుల్లో మార్పు వస్తుంది. నీరు తెల్లగా ఉండే వరకు ఈ ప్రక్రియను పాటించండి. గళ్ల ఉప్పుకు నెగెటివ్ ఎనర్జీని పారద్రోలే శక్తి ఉంది. దిష్టిదోషాన్ని పోగట్టే శక్తి ఉంది. కావాలంటే పరీక్షించి చూసుకోండి.

నెగెటివ్ ఎనర్జీ పోవడానికి తప్పక చేయాల్సిన పనలు

– ప్రతిరోజు పొద్దునే తప్పక ఇంటిముందు ముగ్గులు వేయండి.
– దేవుని గదిలో తప్పక ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయండి
– అవకాశాన్ని బట్టి ధూపం, అగరువత్తీలు, సాంబ్రాణి వంటివి వేస్తూ ఉండండి.
– దేవుని గదిలో గంటరావం తప్పక చేయండి

ఇక ఆలస్యమెందుకు ఈ పనులు చేస్తే తప్పక మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ప్రశాంతత వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. అంతా ఆనందమే. ఈ తంత్రాన్ని నమ్మకంతో ఇష్టదేవతారాధన చేస్తూ చేయండి. తప్పక మండలం రోజుల్లో అంటే 41 రోజుల్లో మార్పు వస్తుంది.

– కేశవ