మన హిందూ దేశంలో శైవ క్షేత్రాల తో పాటు, విష్ణు దేవాలయాలు కూడా ఉన్నాయి. విష్ణు ఆలయాలు అన్నింటిలో ప్రపంచం మొత్తం మీద అత్యంత సంపన్న ఆలయం మన దేశంలోనే ఉంది. సంపన్న ఆలయం అనగానే తిరుమల అనుకున్నారా? కాదు తిరుమల క్షేత్రం రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి దర్శించుకోవాలంటే మూడు ద్వారాల గుండా దర్శించాలి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
అనంత పద్మనాభ స్వామి అనగా నాభి నందు పద్మం కలవాడని అర్ధం. శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభుడుగా వెలసిన పుణ్య క్షేత్రం. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రి. శ. 1568వ సంవత్సరంలో నిర్మించారు. ఆలయ గర్భగుడిలో ప్రధాన దైవం అయిన అనంత పద్మనాభుడు అనంతశయన భంగిమలో దర్శనమిస్తాడు. ఆలయం అతి పురాతనమైన దేవాలయం. ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా చూస్తే తల భాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో తామర పువ్వు, మూడో ద్వారం గుండా చూస్తే పాదాలు కనిపిస్తాయి.
ఈ మధ్య కాలంలో ఇక్కడ దేవాలయంలో కొన్ని గదులను తెరిచారు. దీనితో నేలమాళిగలులో అపారమైన సంపద బయటపడింది. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలకు ముందు 1860 లో మూసిన గదులు 1950 లో సీలు వేశారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 5 నేల మాళిగలు మాత్రమే తెరిచారు. దీనిలో అనతమైన సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవాల్సి ఉంది. దీనితో ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.