మకర సంక్రమణం రోజు గుమ్మడిపండు దానం చేస్తే కలిగే లాభాలు మీకు తెలుసా !

మకరసంక్రమణం … సంక్రాంతి ఈరోజు కేవలం పండుగే కాదు. పలు విశేషాలతో కూడుకున్న ఒక భౌగోళిక, పర్యావరణహిత, మానవత, దయ,దానం అన్నింటి సమ్మేళనం ఈ పండుగ. సంక్రాంతి పండుగ చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక కోణాలున్నాయి..మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతికి శనిభగవానుడు. శని వాత ప్రధాన గ్రహమని శాస్త్రం చెబుతుంది. వాతమనేది నూనె లాంటి పదార్థాల వల్ల, గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది.

కాబట్టి ఆ రోజు తెలకపిండి నలుగుతో స్నానం చేసి శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడి కాయలు దానం చేయాలని మన పూర్వీకులు చెప్పారు. గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక..శ్రీ మహావిష్ణువు ఆది వరాహరూపంలో భూగోళాన్ని పైకి తీసుకొచ్చింది సంక్రాంతి నాడే..కనుక భూమికి సంకేతమైన గుమ్మడి పండును పేదలకు, బ్రాహ్మణులకు దానం చేస్తే భూదేవితో పాటు శ్రీమహా విష్ణువు అనుగ్రహాం లభిస్తుంది.

  • కేశవ