ఫిబ్రవరి 22 శుక్రవారం- రోజువారి రాశిఫలాలు

-

ఇష్టదేవత పారాయణం చేస్తే అన్ని రాశుల వారికి జయం!

february 22nd friday daily horoscope

మేషరాశి- అనుకూల ఫలితాలు, పనులు పూర్తి, వ్యవహార జయం, కొత్త పనుల ప్రారంభానికి అనుకూలం. పరిహారాలు ఇష్టదేవతారాధన, పారాయణం చేసుకోండి.

వృషభరాశి- మిశ్రమ ఫలితాలు, కీర్తిలాభం, పనుల్లో జాప్యం, ధనానికి ఇబ్బంది, బాధలు. పరిహారాలు వేంకటేశ్వరస్వామి, లక్ష్మీ దేవిని మారేడుదళాలతో అర్చన లేదా ప్రదోషకాలంలో శివాభిషేకం లేదా ధ్యానం చేయండి మంచి ఫలితం.

మిధునరాశి- మిశ్రమ ఫలితాలు, కీర్తినష్టం, చేసే పనిలో అభివఋద్ధి, శుభకార్యాలకు హాజరు, ధనవ్యయం. పరిహారాలు ఇష్టదేవతరాధన, నదీస్నానం చేయండి మంచిది.

కర్కాటకరాశి- మిశ్రమం. బంధువుల రాక, అనుకోని సంఘటనలు, ధనలాభం. పరిహారాలు శివారాధన లేదా చాలీసా పఠనం/శ్రవణం చేయండి మంచిది.

సింహరాశి- ప్రతికూల ఫలితాలు, పనుల్లో ఆటంకాలు, జాప్యం, ధననష్టం. పరిహారాలు నవగ్రహస్తోత్ర పారాయణం/ప్రదక్షణలు లేదా గోసేవ చేయండి.

కన్యారాశి- అనుకూల ఫలితాలు, అన్నింటా జయం, ధనలాభం, వ్యవహార లాభం. పరిహారాలు గోసేవ/ఏదో ఒక మంచిపని చేయండి. ఎవరికైనా సహాయం చేయండి.

తులరాశి- ప్రతికూల వాతావరణం, అనారోగ్యం, శ్రమ అధికం, పనుల్లో జాప్యం. పరిహారాలు వేంకటేశ్వరస్వామి ఆరాధన లేదా దేవీ పూజ స్తోత్ర పారాయణం చేయండి మంచి ఫలితం వస్తుంది.

వృశ్చికరాశి- మిశ్రమ ఫలితాలు, జయం, ఆనందం, అధిక శ్రమ, పనుల్లో జాప్యం. వస్త్రలాభం. పరిహారాలు గోసేవ/అన్నదానానికి సహాయం చేయండి.

ధనస్సురాశి- అనుకూల వాతావరణం, కార్యజయం, వ్యవహార లాభం, స్థానచలనం, పరిహారాలు నవగ్రహ స్తోత్ర పారాయణం లేదా ప్రదక్షణలు లేదా ఈశ్వర ఆరాధన చేసుకోండి.

మకరరాశి- అనుకూలమైన రోజు, ప్రయాణ సూచన, బంధువుల రాక, పనులు పూర్తి. పరిహారాలు దశరథ ప్రోక్త శని స్తోత్ర పఠనం/శ్రవణం,శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి మంచిది.

కుంభరాశి- ప్రతికూల ఫలితాలు, పనుల్లో జాప్యం, ఆటంకాలు, విరోధాలు, ధనవ్యయం. పరిహారాలు భగవన్మామ స్మరణ, సింధూర ధారణ/ ఆరావళి కుంకుమ ధరించండి. అమ్మవారి దేవాలయాన్ని దర్శించే ప్రయత్నం చేయండి.

మీనరాశి-అనుకూలమైన ఫలితాలు, స్వల్ప ఇబ్బందులు, ధననష్టం, పనులు పూర్తి, అన్నింటా జయం. పరిహారాలు చండీదీపారాధన, అమ్మవారి దేవాలయ దర్శనం వీలుకానివారు అమ్మవారి కుంకుమ ధరించి దైనందిన కార్యక్రమాలు ప్రారంభించండి.

నోట్ – పరిహారాలు చాలా సులభమైనవి, అత్యంత యోగ్యమైనవి, స్వల్ప ఖర్చుతో కూడనవి మాత్రమే సూచిస్తున్నాం. ఇవి ఆయా శాస్త్ర గ్రంథాలలో, పెద్దలు పలుమార్లు ఆచరించి చెప్పినవి, అత్యంత శక్తివంతమైనవి. నమ్మకంతో ఆచరించండి. తప్పక జయం కలుగుతుంది. ఓం నమో దుర్గాయైనమః శుక్రవారం ఈ నామం జపిస్తే అన్నింటా విజయం. మీకు విజయాలు నేరుగా కన్పించకపోవచ్చు. సూక్ష్మరూపంలో మీకు విజయాలను అమ్మ అనుగ్రహిస్తుంది. ఆచరించండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news