భక్తి: ఇలా శివలింగానికి పూజ చేస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు..!

శివలింగానికి పూజ చేయడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. చాలా మంది అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కొందరు అనారోగ్య సమస్యలతో మరి కొందరు ఆర్థిక సమస్యలతో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది.

అయితే ఇటువంటి సమస్యల్ని దూరం చేసుకోవాలంటే కచ్చితంగా శివలింగానికి పూజ చేయమని పండితులు అంటున్నారు. అయితే ఏ విధంగా పూజ చేయడం వల్ల మంచి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శివుడిని ఆరాధించడం, శివలింగానికి పూజ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. అనారోగ్య సమస్యల నుండి ఆర్థిక సమస్యల వరకూ చాలా సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు.

శివలింగానికి పూజ చేసేటప్పుడు పంచదార లేదా పటిక బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కనుక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ విధంగా ఆచరిస్తే మంచిది.

అదే విధంగా శివుడికి పుష్పాలను సమర్పించడం వల్ల సొంత ఇంటి కల నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు. ఎప్పటి నుండో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా కుదరడంలేదు అంటే కచ్చితంగా మీరు శివ లింగానికి పూలతో పూజ చేయండి.

శివలింగానికిబెల్లం నైవేద్యం పెట్టడం వల్ల పంట నష్టం కలగకుండా మంచి రాబడి వస్తుంది కాబట్టి ఈ విధంగా పంటలు నష్టం కలగకుండా ఉండాలంటే అనుసరించండి. ఇది ఇలా ఉంటే పెరుగుతో శివలింగానికి పూజ చేయడం వల్ల ధనం, ఆనందం, శాంతి ఉంటాయి కనుక ఈ విధంగా పండితులు చెప్పినట్లు అనుసరిస్తే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. పైగా సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి.