మనీ ప్లాంట్ మాత్రమే కాదు.. ఈ మొక్క ఇంట్లో ఉంటే కూడా ఫుల్లు డబ్బే..!

-

చాలామంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కల్ని నాడుతూ ఉంటారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని సంతోషంగా ఉండొచ్చని.. ధన ఆకర్షణ కలుగుతుందని చెప్తారు. అయితే కేవలం మనీ ప్లాంట్ మాత్రమే కాదు ఈ మొక్క కూడా ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. మనకు రోడ్డు పక్కన పొదల్లో, పొలాల్లో ఈ మొక్కలు మనకి కనబడుతుంటాయి. అదే అతిబల మొక్క. చాలా మంది ఈ మొక్కని పిచ్చి మొక్క అనుకుంటారు. కానీ అతిబల ఇంట్లో ఉంటే ఎంతో మేలు కలుగుతుంది.

ఈ మొక్క ప్రయోజనాలని చూశారంటే మీరు షాక్ అవుతారు. అతిబల మొక్క ఎన్నో లాభాలని ఇస్తుంది. ఆయుర్వేదంతో పాటుగా తంత్ర శాస్త్రంలో కూడా దీనిని ఉపయోగిస్తారు. పసుపు రంగులో ఈ మొక్కకి పూలు ఉంటాయి. శరీరానికి బలం ఇస్తుంది మూత్రపిండాల సమస్యలను కంటి సమస్యల్ని దూరం చేస్తుంది. అతిబల మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కొన్ని కొన్ని సార్లు గ్రహ దోషాలు, వాస్తు దోషాలు, పితృ దోషాలు వలన ఇబ్బంది పడుతూ ఉంటాము. డబ్బు రాదు. అలాంటప్పుడు ఈ మొక్కను ఇంట్లో పెంచడం మంచిది, వ్యాపారంలో నష్టాలు కూడా వస్తున్నట్లయితే ఈ మొక్కని ఇంట్లో నాటండి. జాతక దోషాలను, గ్రహదోషాలని అతిబల మొక్క తొలగిస్తుంది. జీవితంలో పురోగతి కావాలనుకుంటే ఈ మొక్కని ఇంట్లో పెట్టండి. ఈ మొక్క ఇంట్లో ఉంటే సంతోషంగా ఉండొచ్చు సమస్యలు తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది హ్యాపీగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version