వాషింగ్ మెషిన్ ని ఇంట్లో పెడుతుంటే ఈ పొరపాట్లను చేయకండి.. ఏ దిశ లో పెట్టాలంటే..?

-

జీవితంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాటిని దూరం చేసుకోవాలి అంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటించడం వలన ఎంతో మార్పుని పొందుతారు. చాలా శాతం మంది వాస్తు శాస్త్రంను నమ్ముతారు. దానిలో చెప్పే చిట్కాలను పాటించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా వాస్తు శాస్త్రంలో చెప్పిన చిట్కాలను పాటించడం వలన అవి తొలగిపోతాయి. దాంతో ఎంతో మార్పుని గమనిస్తారు.

అయితే ఇంట్లో ఉపయోగించే వస్తువులను కూడా సరైన దిశలో ఉంచాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం వాషింగ్ మిషన్ కు సంబంధించి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటోంది. అయితే దీనిని ఏ దిశలో పెడితే మంచి జరుగుతుందో వాస్తు శాస్త్రం లో చెప్పడం జరిగింది. ఆగ్నేయం వైపు వాషింగ్ మిషన్ ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాస్తు శాస్త్రాన్ని పాటించకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొంతమంది బాత్రూంలో ఎక్కువ స్పేస్ ఉందని వాషింగ్ మిషన్ ను బాత్రూంలో పెడుతూ ఉంటారు. ఇలా చేసిన సరే వాషింగ్ మిషన్ ను ఏ దిశలో పెట్టారో చూడాలి. ఈ విధంగా బాత్రూమ్ లో పెడుతున్నప్పుడు వాషింగ్ మిషన్ ని ఈశాన్యం వైపు మాత్రం అస్సలు పెట్టకూడదు. ఈశాన్యంలో పెట్టడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి వైపు కూడా వాషింగ్ మిషన్ ను పెట్టకూడదు. కనుక ఈ నియమాలను తప్పకుండా పాటించి వాస్తు శాస్త్రం ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version