చాలామంది వారి ఇంట్లో వాస్తు ప్రకారం మార్పులు చేసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి వాస్తు ప్రకారం మనం ఫాలో అయితే చాలా సమస్యలు తొలగిపోతాయి కొత్త సంవత్సరం వాస్తు ప్రకారం ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంట పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. కొత్త సంవత్సరం మీకు అదృష్టం కలగాలంటే మీ ఇంట్లో చెత్త చెదారాన్ని తొలగించండి. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి సంతోషంగా ఉండడానికి అవుతుంది. పైగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా హాయిగా ఉంటుంది.
అలాగే మొక్కలకి కూడా ఎంతో పవర్ ఉంటుంది. మొక్కలు మనిషి ఎనర్జీని అందిస్తాయి. గుండ్రంగా ఆకులతో ఉన్న మొక్కలని ఇంట్లో పెంచితే మంచిది. స్నేక్ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్ వంటివి ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. అలాగే అద్దాలను కూడా మంచిగా ఉపయోగించడం. ముఖ్యం ఇంట్లో అద్దం పెట్టేటప్పుడు లైట్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా పెట్టండి.
అద్దాలని సరిగ్గా పెడితే కూడా పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఇంటి ముఖ ద్వారం బాగా ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. విండ్ చైమ్స్ వంటి వాటిని తలుపుల దగ్గర పెట్టొద్దు అవి నెగటివ్ ఎనెర్జీని కలిగిస్తాయి. విండ్ చైమ్స్, బెల్స్ వంటి వాటిని ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగించే విధంగా పెట్టుకోవాలి అలాగే రంగుల్ని కూడా సరిగా ఉపయోగించాలి. బాగా డార్క్ కలర్స్ వంటి వాటిని ఇంట్లో ఉంచకండి కాబట్టి మార్పులు చేసినట్లయితే సంతోషంగా ఉండొచ్చు కొత్త సంవత్సరం బాగుంటుంది.