ఈ శ్లోకాలతో వినాయకుడిని కొలిచి శుభఫలితాలు పొందండి..!

ప్రథమంగా మనం ఏ శుభకార్యం తలపెట్టినా దానిలో ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిగా జరిగి పోవాలంటే ముందు మనం చేసేది వినాయకుడి పూజ. నిజంగా వినాయకుడిని తలుచుకుంటే చాలు ఏ కార్యమైనా నిరాటకంగా సాగిపోతుంది. అయితే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఈ వినాయక చవితి ఒకటి.

 

ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిగా జరుపుకుంటాము. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వరుని పూజిస్తారు. వినాయకుడి రూపం, నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. విఘ్నాధిపతి రూపం విశ్వ మానవాళి గుణగణాలకు ఒక సంకేతం. వినాయక చవితినాడు వినాయకుడిని కొలిచేటప్పుడు ఈ వినాయక శ్లోకాలని తప్పక చదవండి. వీటిని చదవడం వల్ల మీకు శుభం కలుగుతుంది. అలానే మీరు విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండొచ్చు.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాననాయ శృతియజ్ఞ – విభూషితాయ
గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే ||

గజాననం భూతగణాదిసేవితం
కపిత్థ జంబూ ఫలసార భక్షణమ్ |
ఉమాసుతం శోకవినాశకారకం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం ||

తొండమునేక దంతము తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలున్ మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్..

 

lord ganesh

గణేశ అష్టకం:

ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం
లంభోధరం విశాలాక్షం వందేహం గణనాయకం

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం
బాలేందు శకలం మౌళం వందేహం గణనాయకం

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం
కామరూప ధరం దేవం వందేహం గణనాయకం

గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామర భూషితం
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం

మూషికోత్తమ మారూహ్య దేవాసుర మహాహవే
యోద్దుకామం మహావీర్యం వందేహం గణనాయకం

యక్షకిన్నెర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం

అంబికా హృదయనందం మాతృబిహి పరివేష్టితం
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం

సర్వవిఘ్నం హరం దేవం సర్వవిఘ్న వివర్జితం
సర్వసిద్ది ప్రదాతారం వందేహం గణనాయకం

గణాష్టకమిదం పుణ్యం యః పటేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వ కార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్…