నాగులపంచమి రోజు ఉదయం ఇలా చేస్తే సర్ప దోషం జన్మలో రాదట..!!

-

శ్రావణమాసం వచ్చింది అంటే ఎన్నో ముఖ్యమైన పండగలు వస్తాయి..ఈ మాసం శివుడికి ఇష్టం..అందుకే భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు,వ్రతాలు చేస్తారు.ఈ మాసంలో వచ్చే పండుగలలో నాగులపంచమి కూడా ఒకటి..పంచాంగ ప్రకారం, శ్రావణ మాసంలో శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి జరుపుకుంటారు..ఆ రోజున శివుడితో పాటు సర్పాలను కూడా పూజిస్తారు..నాగ పంచమి నాడు పాములను పూజించడం వల్ల కాల సర్పదోషం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ సంవత్సరం నాగ పంచమి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీ మంగళవారం నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈసారి నాగ పంచమి శుభ ముహూర్తం మరియు విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నాగ పంచమి 2022 ఆగస్టు 2, మంగళవారం జరుపుకుంటారు. అదే రోజు మంగళ గౌరీ వ్రతం కూడా అదే రోజు జరుపుకుంటారు. ఈ రోజున పెళ్లి అయిన స్త్రీలు ఉపవాసం ఉండి తమ భర్త దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారు. ఈ సంవత్సరం నాగ పంచమి నాడు, నాగదేవతతో పాటు, శివుడు పార్వతిని కూడా పూజిస్తారు. పవిత్రమైన సంయోగ నియమాల ప్రకారం ఈ రోజున నాగదేవత, శివుడు మరియు పార్వతి దేవిని పూజించడం వల్ల గొప్ప ఫలితాలు పొందవచ్చు..

నాగులపంచమి పూజా విధానం:

*. నాగ పంచమి నాడు దైవ స్వరూపమైన 8 పాములను పూజిస్తారు. అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, తక్షక, కులీర, కర్కట, శంఖ ఈ రోజున పూజిస్తారు.
*. చతుర్థి రోజున ఒక్కపూట భోజనం చేయాలి. పంచమి నాడు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి.
*. ఈ రోజున, చెక్క బల్ల మీద నాగ దేవత బొమ్మ లేదా మట్టి పాము విగ్రహాన్ని పూజించవచ్చు.
*. నాగదేవతకు పసుపు, రోలి (ఎరుపు సింధూరం), బియ్యం, పువ్వులు సమర్పించి పూజిస్తారు.
*. ఆ తర్వాత పచ్చి పాలు, నెయ్యి, పంచదార కలిపి చెక్క బల్లపై ఉంచిన నాగదేవతకు నైవేద్యంగా పెడతారు.
*. ఆ తర్వాత హారతి ఇస్తారు..అంతా అయ్యాక నాగులపంచమి కథ వింటే మంచిదని నిపుణులు అంటున్నారు..

నాగ దేవతను ఆరాధించడం ఆనందం, అదృష్టం కలిగిస్తుందని భావిస్తారు. నాగ పంచమి రోజున నాగదేవతను పూజించడం వల్ల శత్రువుల భయం నుండి విముక్తి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. నాగదేవతను పూజించడం వల్ల జీవితంలో పాముకాటు భయం తొలగిపోతుంది..ప్రత్యేకంగా శ్రావణమాసం నాగులపంచమి నాడు నాగ దేవతను భక్తితో పూజిస్తె ఇక జన్మలో సర్ప దోషాలు ఉండవని పెద్దలు చెబుతున్నారు.

గమనిక: శ్రావణ శుక్ల పక్ష పంచమి తిథి ప్రారంభం: ఆగష్టు 2, 2022 మంగళవారం ఉదయం 5:13 నుండి
శ్రావణ శుక్ల పక్ష పంచమి తిథి ముగుస్తుంది: ఆగస్టు 3, 2022 బుధవారం ఉదయం 5:41 వరకు ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news