సూర్యుడిని ఈ నామాలతో ఆరాధిస్తే ఆరోగ్యం మీ సొంతం !

-

సుష్ఠు ఈరణం గతి: యస్యాసౌ సూర్య: అంటే.. కాలానికి అనుగుణంగా చక్కని గమనం కలవాడు కాబట్టి సూర్యుడు… అని,
సుష్ఠు ఈరణం ప్రేరణం యేనాసౌ సూర్య: సకల జీవరాసులకు మంచి చైతన్యం ఎవరిచేత అయితే కలుగుతుందో అతడే సూర్యుడు, అని సూర్యశబ్దాలు రచించబడ్డాయి. అంటే.. ఆ సూర్యుడే పరబ్రహ్మ స్వరూపుడని దీనికి అర్థం. అతని వల్లే ఈ సృష్టి జరిగి, పోషించ బడుతోంది.

సూర్యుడు తన కిరణాలవల్ల తపింపచేస్తూ భూమ్మీద నీటిని ఆకర్షించి, నీటిని మేఘాలలో నిలుపుతాడు. అప్పుడా మేఘాలు వర్షిస్తాయి.
వర్షంచేత సస్యములు, వృక్షాలు మొలుస్తాయి, వాటివల్ల ఆహారం ఏర్పడుతుంది. ఆహారం నుంచే సమస్తప్రాణులు పుడతారు.
కాబట్టి ప్రాణసృష్టికి మూలమైనవాడు సూర్యుడే .. అతడే పరతత్త్వము.

సూర్యుని రూపాలు

ఇంద్రుడు : స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.
ధాత : ప్రజాపతియై భూతములను సృష్టించాడు.
పర్జన్యుడు: తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.
త్వష్ట: ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.
పూష: ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.
అర్యముడు: దేవతారూపంలో వుంటాడు.
భగుడు: ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.
వివస్వంతుడు: ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు.
విష్ణువు: శత్రువులను నాశనం చేస్తాడు.
అంశుమంతుడు: గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
వరుణుడు: జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.
మిత్రుడు: లోకాలలో మేలుచేస్తూ… చైతన్యాన్ని కలిగిస్తాడు.
ప్రకృతిలోని సూర్యుడు మనకు కన్పించే ప్రత్యక్ష దైవం. ఆయన ఆరాధన ఆయుః ఆరోగ్యాలను అందిస్తుంది. ఉదయించే సూర్యుడు, సాయం సూర్యుడి ముందు నిలబడి ఆ స్వామిని పై శ్లోకాలతో ఆరాధిస్తే తప్పక మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎంత ఉన్నా ఆరోగ్యం లేనిది జీవితం వ్యర్థం అనేది అందరికీ తెలిసిన సత్యం.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news