
ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఒకరు మృతి చెందిన ఘటన మేడారం-తాడ్వాయి మధ్య శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన వ్యక్తి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున వన దేవతల దర్శనం చేసుకొని ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యాడు. బస్సు ఎక్కి కూర్చున్న అనంతరం గుండెపోటుతో బస్సులోనే మృతి చెందడం జరిగింది.