
నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 580.00 అడుగులు (286.125 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు, ఎస్ఎల్బీసీ, జల విద్యుత్ కేంద్రానికి మొత్తం కలిపి 19,857 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ నుండి ఇలాంటి నీటి ప్రవాహం కొనసాగటం లేదని ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు.