యాదాద్రి: శ్రీవారి నిత్య ఆర్జిత సేవల ఆదాయం వెల్లడి

yadadri-temple
yadadri-temple

యాదాద్రి: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాలతో, ప్రసాద వితరణతో, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలతో, సువర్ణపుష్పార్చనతో, వాహన పూజలతో, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదానం విరాళం, యాదఋషి నిలయంతో, తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 12,04,209 ఆదాయం సమకూరిందని తెలిపారు.