
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కొండపాక మండలం లకుడారం శివారులోని సబ్ స్టేషన్ సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగింది. గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన సాయిలు బైక్పై సిద్దిపేట వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో గుర్తుతెలియని వాహనం అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుకునూరుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.