శంషాబాద్: కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడిని.. హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించి, కేసు బుక్ చేశారు. రూ. 21.66 లక్షల విలువ చేసే 409 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేస్ సపోర్టింగ్ మెటల్ ఫ్రేమ్ లోపల బంగారం దాచి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.