GWMC కమిషనర్ ప్రావీణ్యకి ఎన్నడూ ఎదురుకాని పరిస్థితి ఎదురైంది. సోమవారం ప్రజావాణి ఉండటంతో కమిషనర్ కార్యాలయంలోకి వెళుతుంటే, గ్రీవెన్స్‌కి వచ్చిన ఫిర్యాదుదారులు అడ్డుకున్నారు. తమ సమస్యలను ఎవరూ పరిష్కరించడం లేదని, ఇప్పటికి పలుమార్లు వినతులు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని వారు కమిషనర్‌ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కమిషనర్ వారిని తప్పించి లోపలికి వెళ్లిపోయారు.