ఐనవోలు జాత‌ర‌లో కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాలి : వ‌రంగ‌ల్ సీపీ డాక్ట‌ర్ త‌రుణ్ జోషి

-

హ‌న్మ‌కొండ‌, జ‌న‌వ‌రి 5 : ఐనవోలు మల్లన్నను దర్శించుకునే భక్తులు తప్పని సరిగా కోవిడ్ నిబందనలను పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. త‌రుణ్ జోషి భక్తులకు పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేది నుంచి ప్రారంభమయ్యే ఐనవోలు జాతర బందోబస్తు ఏర్పాట్ల పై బుధవారం పోలీస్ అధికారులతో ఐనవోలు లో సమీక్షా జరిపారు. జాతర సందర్బంగా పోలీస్ బందోబస్తు, భక్తుల క్యూలైన్ల నిర్మాణం, సిసి కెమెరాలు, వాహన పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై చర్చించారు.

జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, జాతరకు వచ్చే మార్గంలో ఏవిధమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై స‌మీక్షించారు. ఐనవోలు దేవాలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ ను ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు ఆలయ చైర్మెన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, లా అండ్ అర్ఢర్ అదనపు డీసీపీ సాయి చైతన్య, మామూనూరు ఏసీపీ నరేశ్ కుమార్, పర్వతగిరి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్ఐ భరత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news