మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి నియమించబడ్డారు. బండి సంజయ్‌ని తొలగించి కిషన్ రెడ్డిక్ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే అధ్యక్షుడుగా బండి బాగా పనిచేయలేదు అని చెప్పడానికి లేదు. ఆయన బాగానే పనిచేశారు. అసలు బిజేపికి బలం పెంచి…బిఆర్‌ఎస్ తో ఢీ అంటే ఢీ అనేలా ముందుకెళ్లారు. రెండు ఉపఎన్నికల్లో పార్టీ గెలిచింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర చేసి పార్టీకి బలం పెంచారు.
కాకపోతే బిజేపిలో కొన్ని విభేదాలు…కొందరు నేతలని కలుపుకుని వెళ్లకపోవడం, బండి ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారనే విమర్శలు వల్ల..ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఇక అనుభవం ఉన్న కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టారు. మొదట నుంచి సామాన్య బిజేపి కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన కిషన్ రెడ్డి..గతంలో ఉమ్మడి ఏపీకి అధ్యక్షుడుగా పనిచేశారు. పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డారు.
అయితే అప్పుడున్న పరిస్తితులు వేరు..ఇప్పుడు పరిస్తితి వేరు. చాలా సౌమ్యంగా ఉండే కిషన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్తితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది పెద్ద ప్రశ్న…ఆయన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. అందర్నీ సమన్వయం చేసుకోవాలి. విభేదాలు రాకుండా చూసుకోవాలి…ఇక బండి మాదిరిగా కేసిఆర్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్ళాలి. బలమైన బిఆర్‌ఎస్ పార్టీతో పోటీ పడాలి…అన్నిటికంటే పార్టీని గెలిపించాలి. ఇవన్నీ కిషన్ రెడ్డి సాధ్యం చేయాలి.
అలాగే అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేయ్యాలి. కాకపోతే ఓ వైపు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే…మరోవైపు తెలంగాణ బాధ్యతలని చూసుకోవాలి…అటు ఎంపీగా తన పార్లమెంట్‌ని చూసుకోవాలి..ఇంచార్జ్‌గా అంబర్‌పేట్ స్థానంలో బలపడాలి. అబ్బో ఇలా ఒకటి ఏంటి..కిషన్ రెడ్డికి చాలా టాస్క్‌లు ఉన్నాయి. ఇక బండికి కేంద్ర మంత్రి పదవి వస్తే…ఆయనని ఎలా సమన్వయం చేసుకుంటారు…ఇటు ఈటల రాజేందర్ తో ఎలా కలిసి పనిచేస్తారనేది పెద్ద ప్రశ్న..చూడాలి మరి ఈ సవాలు అధిగమించి కిషన్ రెడ్డి…బిజేపిని అధికారంలోకి తీసుకొస్తారో లేదో.