ఎక్కడైనా అధికార పార్టీలు ప్రభుత్వ పరమైన బాధ్యతలని ఎక్కువ చూసుకుంటూ..పార్టీ పరమైన కార్యక్రమాల్లో తక్కువగా ఉంటాయి. ఏదో ఎన్నికల ముందు పార్టీ పరమైన కార్యక్రమాలు చేస్తారు..దీని వల్ల అధికార పార్టీలకు కాస్త అడ్వాంటేజ్ తగ్గుతుంది..అలాగే ఎప్పుడు ప్రజల్లో ఉండే ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలనే లక్ష్యంగా ఏపీలో అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది.
2019 ఎన్నికల ముందు అధికారంలో ఉన్న టీడీపీ..పూర్తిగా ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో మునిగి తేలింది..దీని వల్ల పార్టీని తక్కువ పట్టించుకున్నారు. చంద్రబాబు పార్టీపై ఫోకస్ పెట్టకపోవడం, అటు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్..పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండటం ద్వారా..వైసీపీ ప్రజలకు దగ్గరైంది..టీడీపీ దూరమైంది. దీని వల్ల 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించారు. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది..ప్రతిపక్షంగా టీడీపీ ఉంది.
ఇక మొదట నుంచి టీడీపీ ప్రజల్లో ఉంటూ వస్తుంది..అలా అని వైసీపీ ప్రజల్లో లేకుండా లేదు. జగన్ తనదైన మార్క్ రాజకీయాలు చేస్తూనే వచ్చారు. నిత్యం వైసీపీని ప్రజలకు దగ్గరగానే ఉండేలా చూసుకున్నారు. ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు సైతం పార్టీకి ఉపయోగపడేలా చేశారు. ముఖ్యంగా పథకాల ద్వారా తన మార్క్ చూపించారు. పథకాలు ఎవరు ఇచ్చారంటే జగన్ ఇచ్చారని ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి కల్పించారు. అయితే ఎన్నికలకు ఆరు నెలల ముందు అధికారంలో ఉన్నవారు పార్టీ పరంగా ఫోకస్ పెడతారు.
కానీ ఏడాదిన్నర ముందు నుంచే జగన్..పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం నడిపిస్తూనే..మరోవైపు పార్టీ బలం తగ్గకుండా చూసుకుంటూ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యేని గడపగడపకు పంపారు. మామూలుగా అధికార ఎమ్మెల్యేలు త్వరగా ప్రజల్లోకి వెళ్లరు. కానీ జగన్ గడపగడపకు పెట్టి..ఎమ్మెల్యేలని ఇంటింటికి తిప్పారు. కొన్ని చోట్ల ప్రజల నుంచి నిరసనలు వచ్చినా సరే..ఎమ్మెల్యేలు తిరుగుతున్నారనే భావన వచ్చింది.
అలాగే జగన్ సైతం..పథకాల ప్రారంభం, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో భారీ సభల ద్వారా ప్రజల్లో ఉంటున్నారు. ఇలా అధికార పార్టీ అంతా ప్రజల్లోనే ఉంటుంది. ఇక ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటినుంచే వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు ఎప్పటికప్పుడు వర్క్ షాపులు పెట్టి ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నారు. అలాగే పార్టీలో వ్యూహాకాత్మక మార్పులు చేస్తున్నారు. తాజాగా జిల్లా అధ్యక్షులని, రీజనల్ కో ఆర్డినేటర్లని మార్చేశారు. అటు సరిగ్గా పనిచేయకపోతే సీటు ఇవ్వనని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేశారు. ఓవరాల్ గా చూసుకుంటే అధికారంలో ఉండి కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ తన మార్క్ రాజకీయాలతో సత్తా చాటుతున్నారు.