ఇంటర్‌ పాసైతే.. 1600 ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..!

-

ఉద్యోగాలు: మీరు మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ ని చూడాల్సిందే. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చెయ్యచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో పలు పోస్టులు వున్నాయి. 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చెయ్యవచ్చు.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. జూన్‌ 8వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ప్యాస్ అయ్యి ఉండాలి. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు అయితే ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవాల్సి ఉంది. పోస్టుల వివరాలు చూస్తే.. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌-ఏ).

01-08-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. 02-08-1996 నుంచి 01-08-2005 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉండగా ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది. టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా వీటిని బట్టీ ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల తరవాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 గా నిర్ణయించారు. కానీ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు ఏమీ లేదు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్‌ 8, 2023. ఆఫ్‌లైన్ ద్వారా చలానా చెల్లింపులకు చివరి తేదీ జూన్‌ 12, 2023. పూర్తి వివరాలను https://ssc.nic.in/ లో చూసి అప్లై చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version