ఐడీఆర్‌బీటీలో ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేష‌న్ ప్రాసెస్‌ మొదలైన వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని భార‌త ప్ర‌భుత్వం రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డెవ‌లప్‌మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ అండ్ టెక్నాల‌జీ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. పలు విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టులకు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. అయితే ఆఫ్ లైన్ పద్దతి లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. దీనిలో మొత్తం నాలుగు ఖాళీలు వున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డెవ‌లప్‌మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ అండ్ టెక్నాల‌జీ భర్తీ చేస్తోంది.

అర్హత వివరాల లోకి వెళితే.. గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ చేసి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. శాలరీ విషయానికి వస్తే.. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా నెల‌కు వేత‌నం రూ.70,900 నుంచి రూ.1,01,500 వ‌ర‌కు చెల్లిస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఏప్రిల్ 18 , 2022 ఆఖరి తేదీ. పూర్తి వివరాలను https://www.idrbt.ac.in/careers.html ను చూసి తెలుసుకోవచ్చు.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: The Human Resources Department, IDRBT, Castle Hills,
Road No.1, Masab Tank, Hyderabad – 57 అడ్ర‌స్‌కు పంపాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version