నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్‌ పోస్టులు..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ విజయనగరం జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

వార్డు వాలంటీర్‌

పదో తరగతి/ ఇంటర్‌ ఉత్తీర్ణులైన వాళ్ళు అప్లై చెయ్యచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 187 వాలంటీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. జూన్‌ 30 దరఖాస్తులకు చివరి తేది. స్థానికంగా నివాసం ఉండాలి. అలాగే ప్రభుత్వ పథకాలమీద పూర్తి అవగాహన అవసరం.

ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పరిజ్ఞానం ఉండాలి. అదే విధంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ అవసరం. తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలి.

ఇక వయస్సు విషయంలోకి వస్తే.. 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. జిల్లా సెలెక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news