విజ‌య‌ప‌థం – వరల్డ్ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్‌

-

1. పగళ్ళు, రాత్రులు సరిసమానంగా ఉండేది ?
ఎ) భూమధ్యరేఖ
బి) కర్కటరేఖ
సి) అంటార్కిటికా
డి) ధృవాలు

వరల్డ్ జాగ్రఫీ - world-geography

2. ధ్రువాల దగ్గర రోజు అత్యధిక పొడవు?
ఎ) 12 గంటలు
బి) 24 గంటలు
సి) 3 నెలలు
డి) 6 నెలలు

3. భూమి సూర్యునికి దగ్గరగా చేరు రోజు?
ఎ) రవినీచ
బి) అపహేళి
సి) ఉత్తరాయణాంతము
డి) దక్షిణాయణాంతము

4. భూమి ఎప్పుడు రవినీచ స్థానానికి చేరుకుంటుంది?
ఎ) చంద్రునికి దగ్గరగా ఉన్నప్పుడు
బి) సూర్యునికి దగ్గరగా ఉన్నపుడు
సి) ప్లూటోకు దగ్గరగా ఉన్నపుడు
డి) సూర్యునికి అతిదూరంగా ఉన్నపుడు

5. సంవత్సరంలో ఉత్తార్ధగోళంలో అతితక్కువ పగటి సమయం కలిగిన రోజు ఏది?
ఎ) డిసెంబర్ 25
బి) డిసెంబర్ 24
సి) డిసెంబర్ 23
డి) డిసెంబర్ 22

6. నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి?
ఎ) విశ్వాంతరాళం అంతా తూర్పునుండి పడమరకు పయనిస్తుంది
బి) భూమిసూర్యుని చుట్టూ తిరుగుతున్నది
సి) భూమి తూర్పు నుండి పడమరకు గుండ్రంగా తిరుగుతున్నది
డి) భూమి పడమర నుండి తూర్పుకు గుండ్రంగా తిరుగుతున్నది

7. భూమి వయస్సు దాదాపు?
ఎ) 10 మి.సంవత్సరాలు
బి) 15 మి.సంవత్సారాలు
సి) 4.5 మి.సంవత్సరాలు
డి) 6 మి.సంవత్సరాలు

8. క్రింది వాటిలో ఉత్తరార్ధ గోళంలో అపర్యాప్త రోజు(పగలు తక్కువగా) ఏది?
ఎ) సెప్టెంబర్ 22
బి) మార్చి 21
సి) డిసెంబర్ 22
డి) సెప్టెంబర్ 24

9. సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఏ నెలలో ఉంటుంది?
ఎ) జనవరి
బి) మార్చి
సి) జూన్
డి) సెప్టెంబర్

10. భూగోళము సూర్యునికి అతి తక్కువ దూరంలో ఉన్న స్థితిని ఈ విధంగా అంటారు?
ఎ) అపహేళి
బి) పరిహేళి
సి) పెరిజీ
డి) అపోజీ

జవాబులు:

1. పగళ్ళు, రాత్రులు సరిసమానంగా ఉండేది ?
జవాబు:
భూమధ్య రేఖ దగ్గర పగళ్లు, రాత్రులు సరిసమానంగా ఉంటాయి

2. ధ్రువాల దగ్గర రోజు అత్యధిక పొడవు?
జవాబు: డి
ఆరు నెలలు. ఉత్తర ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు మార్చి 21- అస్తమించే రోజు సెప్టెంబర్ 22 లేదా 23, దక్షిణ ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు సెప్టెంబర్ 22 లేదా 23 అస్తమించే రోజు మార్చి 21

3. భూమి సూర్యునికి దగ్గరగా చేరు రోజు?
జవాబు:
రవినీచ రోజు సూర్యుడికి దగ్గరగా భూమి చేరుకుంటుంది

4. భూమి ఎప్పుడు రవినీచ స్థానానికి చేరుకుంటుంది?
జవాబు: బి
సూర్యునికి దగ్గరగా భూమి చేరుకున్నప్పుడు రవినీచ స్థానానికి చేరుకుంటుంది

5. సంవత్సరంలో ఉత్తార్ధగోళంలో అతితక్కువ పగటి సమయం కలిగిన రోజు ఏది?
జవాబు: డి
ఆయాంతమైన డిసెంబర్ 22న సంవత్సరంలో ఉత్తార్ధగోళంలో అతితక్కువ పగటి సమయం ఉంటుంది.

6. నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి?
జవాబు: డి
భూమి పడమర నుండి తూర్పుకు గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతున్నందున నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి.

7. భూమి వయస్సు దాదాపు?
జవాబు: సి
భూమి వయస్సు 45 లక్షల సంవత్సరాలు ఉండవచ్చని అంచనా.

8. క్రింది వాటిలో ఉత్తరార్ధ గోళంలో అపర్యాప్త రోజు(పగలు తక్కువగా) ఏది?
జవాబు: సి
ఆయాంతమైన డిసెంబర్ 22న సంవత్సరంలో ఉత్తార్ధగోళంలో పగలు తక్కువగా ఉంటుంది.

9. సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఏ నెలలో ఉంటుంది?
జవాబు:
జనవరిలో సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఉంటుంది.

10. భూగోళము సూర్యునికి అతి తక్కువ దూరంలో ఉన్న స్థితిని ఈ విధంగా అంటారు?
జవాబు: బి
పరిహేళి సమయంలో భూగోళము సూర్యునికి అతి తక్కువ దూరంలో ఉంటుంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news