Sri Reddy: ఆ ఖజానాను నా బాయ్ ఫ్రెండ్‌కి మాత్రమే చూపిస్తా.. లైవ్ లో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి

-

Sri Reddy: టాలీవుడ్ ప్రేక్షకులకు శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవ‌స‌రం లేదు. ఆమె సినిమాలు చేయ‌డం క‌న్నా.. నెట్టింట్లో ర‌చ్చ చేయ‌డమే ఎక్కువ. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. నెట్టింట్లో కాక రేపుతుంది. గ‌త కొన్నాళ్లుగా ఈ హాట్ బ్యూటీ హెల్త్ ఇష్యూస్‌తో సోషల్ మీడియాలో దూరంగా ఉంది. ఇటీవ‌ల శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ మ‌ళ్లీ త‌న‌దైన శైలిలో నెట్టింట్లో వరుస వీడియోలు వదులుతుంది. తాజాగా.. ఫేస్ బుక్‌ లైవ్‌లోకి వ‌చ్చింది. చిన్న నిక్క‌ర్ , టైట్ టాప్ వేసుకుని త‌న ఒంపు సొంపుల‌ను చూపుస్తూ.. నెటిజ‌న్లను హీటెక్కించింది. త‌న మ‌త్తెక్కించే మాటలతో ఫాలోవర్స్ ను రెచ్చ‌గొట్టింది శ్రీ‌రెడ్డి.


ఈ క్ర‌మంలో అడుగు అడుగునా ఆమె లైవ్‌కి అడ్డుతగులుతూ కామెంట్ల మోత మోగించారు త‌న ఫాలోవ‌ర్స్. ఈ త‌రుణంలో ఓ ఫాలోవ‌ర్ .. ఫోన్ నెంబర్ చెప్పాలని శ్రీ రెడ్డిని ప‌దేప‌దే విసిగించాడు. దీంతో అతనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా 36-28-40 అంటూ తన సైజులు చెప్పి.. ఈ నెంబర్స్ రాసుకోమని చెప్పింది శ్రీరెడ్డి. అనంత‌రం మ‌రో నెటిజ‌న్ త‌న కలర్‌పై కామెంట్ చేయడంతో.. ‘తెల్ల తోలు తెల్ల తోలు అంటారు కానీ తెల్ల తోలు వాడటం మొదలుపెడితే మాసిపోవడం తప్ప ఏమీ ఉండదు’ అంటూ ఘాటూగా రిప్లే ఇచ్చింది.

పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడ‌ని ప్ర‌శ్నించ‌డంతో.. రాజకీయాల్లోకి వచ్చేటంత డబ్బు తన దగ్గర లేదని.. రాలేన‌ని చెప్పేసింది. మందుతాగుతారా? అని మరో నెటిజన్ ప్ర‌శ్నించ‌డంతో ఏ మాత్రం సందేహించ‌కుండా.. వైన్ తాగుతా న‌ని సుత్తిలేకుండా చెప్పెసింది.

త‌న క్యారెక్టర్‌పై ఓ నెటిజ‌న్ నెటిగివ్ కామెంట్స్ చేయ‌డంతో .. ‘నా రియల్ క్యారెక్టర్ నాకు తెలుసు.. నేను బోల్డ్ కావచ్చు కానీ.. నా ఫీలింగ్స్ మాత్రం ఎవ్వ‌రికి మ్యాచ్ కావు. సాంప్రదాయాలంటే చాలా ఇష్టమే కానీ.. వాటిని ఫాలో కావ‌డం చాలా క‌ష్టం. న‌న్ను ఎవరో మెచ్చుకుంటారో తెలియ‌దు కానీ, నాకు న‌చ్చిన‌ట్టు నేను ఉంటా అంటూ త‌న గురించి తాను చెప్పుకోవడం మొదలుపెట్టింది శ్రీరెడ్డి.

అయితే శ్రీరెడ్డి లైవ్‌లో ఉండగా.. ఆమె ఫాలోవర్స్ చాలామంది జుట్టును వెనక్కి వేసుకోమ‌ని మెసేజ్‌లు పెట్టారు. దీంతో శ్రీరెడ్డి తనదైన శైలిలో ఘాటుగా స్పందించింది. జుట్టు వెనక్కి తీయమంటారేంట్రా వెధవల్లారా?.. నా జుట్టు వెనుక పెద్ద బాండాగారం ఉంది.. పెద్ద ఖజానా ఉంది. ఆ ఖజానా ఎవ‌డికి ప‌డితే వాడికి చూపించ‌ను. కేవ‌లం నా బాయ్ ఫ్రెండ్‌కి మాత్రమే చూపిస్తా.. అంటూ ఘాటూగా రిప్లే ఇచ్చింది.

ప్రస్తుతం నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను కానీ.. త్వరలో మంచి పర్సన్‌‌తో డేటింగ్ స్టార్ట్ చేస్తా అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఇలా ఫేస్ బుక్‌ లైవ్‌లో శ్రీరెడ్డి తన విశ్వరూపం చూపించింది. మొత్తం మీద త‌న భారీ అందాలను చూపిస్తూ.. త‌న‌ ఫాలోవర్స్ రెచ్చగొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news