సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు! కార‌ణ‌మ‌దేనా?

-

క‌రోనా క‌ష్ట‌కాలంలో రియల్ హీరోగా నిలిచిన సినీ న‌టుడు సోనూసూద్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసినట్టు సమాచారం. ఏక కాలంలో ముంబయిలోని తన నివాసం, ఆఫీస్ తోపాటు 6 ప్రాంతాలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. పలు లెక్కల అవకతవకలపై ఆరా తీసిన‌ట్టు , సోనూ సూద్‌కు చెందిన అకౌంట్ బుక్‌లో కొన్ని ట్యాంపరింగ్‌లకు సంబంధించి ఈ సోదాలు చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడి చేయడంతో సోనూసూద్ షాక్ అయ్యారు.

సోనూసూద్ కరోనా క‌ష్ట‌ కాలంలో వేలాది మందికి ఆయన ఆపన్నహస్తం అందించారు. వలసదారుల కోసం ప్రత్యేక విమానాలను నిర్వహించి వారిని ఇళ్లకు పంపించాడు. వారికి అండ‌గా నిలిచారు. త‌న సేవల‌తో , త‌న కార్యక్ర‌మాల‌తో వేలాది మందికి ఆదర్శంగా నిలిచారు.ల‌క్షలాది మంది గుండెల్లో దైవంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోనూ సోనూ సూద్ చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. ఏపీలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయించాడు.

ఇటీవ‌ల ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ క్ర‌మంలోనే ఆయన రాజకీయాల్లోకి ఏంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు జోరందుకుంది. ఈ త‌రుణంలో ఐటీ దాడులు నిర్వ‌హించ‌డం ప‌లు అనుమానాలు ఊతమిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version