friendship day : ఎలా వ‌చ్చింది? దాని వెనుక ఉన్న చ‌రిత్ర‌?

-

స్నేహితుడు అనే వాడు దేవుడిచ్చిన గొప్ప వరం అంటారు పెద్దలు. నీ స్నేహితులెవరో చెప్పు.. నువ్వు ఎటువంటి వ్యక్తివో చెబుతానంటాడు ఓ గొప్ప వ్యక్తి. స్నేహితుడికి అంత విలువ. friendship day 2021

రక్తం పంచుకోలేదు.. బంధువు కాదు.. ఇంట్లోని వ్యక్తి కాదు… కానీ… అవసరానికి మాత్రం ఆదుకుంటాడు. నేనున్నానంటూ ముందుకు వస్తాడు. ఎక్కడో పుడతాడు.. ఎక్కడో పెరుగుతాడు. అస్సలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి.. కానీ.. నీ జీవితంలోకి వస్తాడు. నీకు తోడుంటాడు. కష్టాల్లో ఓదార్చుతాడు. సంతోషంలో భాగమవుతాడు. నేనున్నానని.. నీకేంకాదని.. అంటాడు.. అతడే ఫ్రెండ్.. స్నేహితుడు..

friendship day 2021
friendship day 2021

అవును… స్నేహితుడు అనే వాడు దేవుడిచ్చిన గొప్ప వరం అంటారు పెద్దలు. నీ స్నేహితులెవరో చెప్పు.. నువ్వు ఎటువంటి వ్యక్తివో చెబుతానంటాడు ఓ గొప్ప వ్యక్తి. స్నేహితుడికి అంత విలువ.

ఆగస్టు మాసం వచ్చిందంటే చాలు సందడే సందడి. ఫ్రెండ్ షిప్ డే సెలబ్రేషన్స్ బిగిన్ అవుతాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటాం మనం. ఇక.. ఆరోజు ఫ్రెండ్స్ అంతా సరదాగా గడుపుతారు. తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటారు. తమ స్నేహం ఇలాగే పది కాలాల పాటు ఉండాలని బ్యాండ్స్ కట్టుకుంటారు. ఇలా.. స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

కానీ.. ఆగస్టు మొదటి ఆదివారం ఎందుకు ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు… అసలు.. ఫ్రెండ్ షిప్ డే ఎలా వచ్చింది… అనే విషయాలు తెలుసా మీకు. చాలామందికి తెలియదు.

ఇప్పుడు మనం… ఫ్రెండ్ షిప్ డే గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అది 1935 వ సంవత్సరం. యూఎస్ లో అప్పటి ప్రభుత్వం.. ఓ వ్యక్తిని చంపింది. ఆగస్టు మొదటి శనివారం రోజు అతడిని ప్రభుత్వం చంపింది. ఆ వ్యక్తి మరణ వార్త విన్న అతడి స్నేహితుడు.. అతడి మరణాన్ని తట్టుకోలేకపోతాడు. ఆ మరుసటి రోజు(ఆదివారం) అతడి స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు.

ఈ ఘటనపై యూఎస్ ప్రభుత్వం స్పందించి.. వాళ్ల స్నేహానికి సలాం కొడుతుంది. వీళ్ల స్నేహం చిరకాలం అలాగే ఉండాలని.. వాళ్ల స్నేహానికి గుర్తుగా… ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. అలా… అప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించాయి.

Read more RELATED
Recommended to you

Latest news