ఆఫీసులో చేసుకునే ‘YOGA’ ఆసనాలు.. నిమిషాల్లో ఒత్తిడి ఉష్‌ కాకి

ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంత బిజీగా మారిపోయాడంటే తనను తాను పట్టించుకోనంతగా.. ఎమయ్యా నీగురించి నీవు ఒక్క పది నిమిషాలు కేటాయించి వ్యాయామం చేసుకోవచ్చు కదా.. అంటే అబ్బా ఈ వ్యాయామాలు, యోగలు చేసేంత టైమ్‌ ఎక్కడుందండీ అంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఉదయం 6 గంటలకు లేచి. గబగబా వంట, పిల్లల్ని తయారు చేసి, 8-30 గంటల కల్లా ఆఫీస్ కి బయలుదేరతాను. మళ్లీ తిరిగి ఇంటికి రావడానికి 6-30 అవుతుంది. ఇంటికొచ్చే సరికి. మళ్ళీ పిల్లల్ని తయారు చెయ్యడం, వంట, భోజనం, హోమ్ వర్క్, నిద్రపోవడం.. ఇదీ నా దినచర్య, ఇంకా నా జీవితంలో యోగాని ఎప్పుడు చెయ్యగలను..? అంటూ చెప్పుకొస్తున్నారు.

మీకు తినడానికీ, కబుర్లు చెప్పుకోవడానికీ, ఉద్యోగం చేసుకోవడానికీ, అన్నింటినీ సరి చూసుకోవడానికీ, సమయం ఉంది. కానీ మిమ్మల్ని గురించి మీరు సరి చూసుకోవడానికి, మీ దగ్గర సమయం లేదు. దాన్ని ఏమీ చేయలేము కానీ మీ ఆఫీస్‌లో మీ కంప్యూటర్ ముందు కూర్చుని చేసే కొన్ని యోగ ఆసనాలు క్రింది వీడియోలో చూసి చెయ్యండి..

ఈ చిన్న చిన్న ఆసనాలు మీమ్మల్ని ఒత్తిడి నుండి దూరం చేయగలవు. ఉపయోగపడే ఇలాంటి సమాచారాన్ని మీ సన్నిహితులతో, స్నేహితులతో షేర్‌ చేసుకోండి..Yoga