రక్షాబంధన్ రోజు మీ సోదరికి ఈ బహుమతులు ఇవ్వచ్చు..!

రక్షాబంధన్ ( Raksha Bandhan ) నాడు సోదరికి గిఫ్ట్ కచ్చితంగా ఇవ్వాలి. అటువంటి సమయంలో మీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలో అర్థం అవ్వడం లేదా…? అయితే మీకోసం కొన్ని గిఫ్టింగ్ ఐడియాస్. సాధారణంగా ఆడవాళ్లు ఎక్కువగా పర్సనల్ కేర్ పై శ్రద్ధ పెడతారు. కనుక వాళ్ళకి బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా ఇలాంటి సామాన్లు బాగా ఉపయోగపడతాయి. అయితే మరి వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం.

 

rakshabandan
Raksha Bandhan | రక్షాబంధన్

పర్సనల్ కేర్ కోసం:

వాళ్ళ యొక్క పర్సనల్ కేర్ కోసం మంచి సబ్బులు లేదా బాత్ కిట్స్ వంటివి ఇవ్వొచ్చు లేదు అంటే ఆర్గానిక్ సబ్బులు, ఆర్గానిక్ షవర్ జెల్ లాంటివి మీరు కొని ఇవ్వచ్చు. తప్పకుండా వాళ్ళు ఇష్టపడతారు.

మేకప్ కోసం:

ఆడవాళ్లు ఎక్కువగా మేకప్ కి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అటువంటి ఆడవాళ్ళకి మీరు మేకప్ సామాన్లు ఇస్తే ఎంతో బాగా నచ్చుతుంది. ఐ షాడో కిట్, హైలైటర్, లిప్స్టిక్, ఫౌండేషన్ ఇటువంటి వాటినన్నిటినీ కలిపి మీరు ఇవ్వచ్చు. పైగా ఇది బాగా వాళ్ళకి ఉపయోగపడతాయి కూడా.

స్కిన్ కేర్ కోసం:

స్కిన్ కేర్ కోసం కూడా మీరు మంచి సన్ స్క్రీన్ లోషన్, క్రీమ్ వంటి వాటిని ఇవ్వొచ్చు. ఇవి కూడా వాళ్ళకి కచ్చితంగా నచ్చుతాయి.

సువాసన కోసం:

మంచి సువాసననిచ్చే సెంట్లు వంటి వాటిని కూడా మీరు గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఇవి కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. వాళ్ళు ఉపయోగించే సెంట్ లేదా మంచి సువాసన వచ్చే సెంట్ ని మీరు కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వొచ్చు.

జుట్టు కోసం:

హెయిర్ కోసం కూడా మీరు కొన్ని ప్రొడక్షన్ ఇవ్వచ్చు. హెయిర్ జెల్, ఆర్గానిక్ ఆయిల్, హెయిర్ మాస్క్ మొదలైనవి కూడా ఇవ్వచ్చు.