దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ విద్యా దినోత్సవం

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యాదినోత్సవం జరపనున్నారు. ఇందుకు అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఈరోజు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఇవాళ చదువుల పండగను ఘనంగా నిర్వహించనున్నారు. పూర్తైన “మన ఊరు… మన బడి” పాఠశాలలతోపాటు సుమారు పదివేల గ్రంథాలయాలు, దాదాపు 1600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నారు. విద్యార్థులకు యునిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, ప్రాథమిక పాఠశాలల టీచర్లకు ట్యాబ్‌లు ఇవాళ పంపిణీ చేయనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు రవీంద్ర భారతిలో దశాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యా దినోత్సవంలో పాల్గొంటారు. తొమ్మిదేళ్లలో విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను వివరిస్తారు.  పనులు పూర్తయిన సుమారు 700కిపైగా మన ఊరు మన బడి పాఠశాలలను నేడు ప్రారంభించనున్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి సన్మానించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news